స్పీడ్ పెంచిన తెలుగు హీరోస్.. ఎవరెక్కడ బిజీనో తెలుసుకోండి!

Updated on: Aug 09, 2025 | 12:18 PM

సెకండ్‌ హాఫ్‌లో వరుస రిలీజ్‌లు ఉండటంతో షూటింగ్స్ స్పీడు కూడా పెరిగింది. టాప్ స్టార్స్‌ నుంచి యంగ్ హీరోలు వరకు ప్రతీ ఒక్కరు సెట్స్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా రాబోయే ఆరు నెలల్లో రిలీజ్‌ కావాల్సిన సినిమా షూటింగ్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏ ఏ హీరోలు ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారు ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న  ది రాజా సాబ్ చిత్ర షూట్ అజీజ్‌నగర్‌లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పెద్ది షూటింగ్‌ కూడా అక్కడే జరుగుతోంది.

2 / 5
పవన్‌ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

3 / 5
రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూక షూట్ ముచ్చింతల్‌లో.. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి.

4 / 5
విజయ్‌ సేతుపతి పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూట్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. నాగచైతన్య హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వంచరస్‌ యాక్షన్ సినిమా షూట్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది.

5 / 5
తేజ సజ్జా మిరాయి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.. అలాగే సిద్దు జొన్నలగడ్డ హీరోగా కోన నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు కదా షూట్ శంకరపల్లిలో జరుగుతుంది. అఖిల్ లెనిన్ చిత్ర షూట్ బూత్‌ బంగ్లాలో జరుగుతుంది.