కొబ్బరినీరు పొటాషియానికి మంచి మూలం.. అంతేకాకుండా, ఇది విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, అనేక ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. దీని గొప్ప లక్షణం ఏమిటంటే దీన్ని తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడదు. సాధారణంగా వేసవిలో డీహైడ్రేషన్ వస్తుంది.. కావున కొబ్బరినీరు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరినీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లను వెంటనే అందించడానికి పని చేస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.