5 / 5
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు... బాడీ డిస్మోర్ఫియా అనేది మానసిక అనారోగ్యమా? అని.. నిజానికి బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ (BDD) లేదా బాడీ డిస్మోర్ఫియా అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఒక వ్యక్తి తన బాహ్య రూపంతో సంతోషంగా లేకపోతే తనను తాను మళ్లీ మళ్లీ అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ వయస్సు వారిలోనైనా ఈ రుగ్మత అభివృద్ధి చెందవచ్చు. అయితే ఈ డైస్మోర్ఫిక్ రుగ్మత లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ టీనేజర్లు, యువకులలో ఈ వ్యాధి చాలా సాధారణం అని అధ్యయనాలు చెబుతున్నాయి.