Hydrosalpinx: అమ్మాయిల్లో ఈ కడుపు నొప్పి నరకమే.. అసలెందుకు వస్తుందో తెలుసా?

Updated on: May 29, 2025 | 7:53 PM

ఫెలోపియన్ నాళాలు.. స్త్రీలలో అండాశయాలు, గర్భాశయం మధ్య అనుసంధాన నాళాలు ఇవి. చాలా మంది మహిళలకు ఈ గొట్టాలలో అడ్డంకులు రావడంతో విపరీతమైన కడుపు నొప్పితో అల్లాడిపోతుంటారు. వైద్య పరిభాషలో దీనిని హైడ్రోసాల్పిన్క్స్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? నివారణ ఎలా ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు? వంటి వివరాలు మీ కోసం..

1 / 7

2 / 7
హైడ్రోసాల్పిన్క్స్ చికిత్సకు లాపరోస్కోపీ, IVF విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మూత్ర విసర్జన సమయంలో మంట, ఋతుస్రావం సమయంలో నొప్పి ఇవన్నీ హైడ్రోసాల్పింక్స్ లక్షణాలు. ఫెలోపియన్ నాళాలలో ఇన్ఫెక్షన్ ఉండి, ఉదరం ఉబ్బితే మహిళల గర్భాశయంలో సమస్యలు ఉన్నట్లే.

3 / 7
ఎవరికైనా హైడ్రోసాల్పింక్స్ సమస్య ఉంటే, దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. క్లామిడియా, గోనేరియా మొదలైన కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు (STDలు) హైడ్రోసాల్పిన్క్స్ వంటి వ్యాధులకు కారణమవుతాయి.

4 / 7
క్షయవ్యాధి కూడా ఫెలోపియన్ నాళాలు, గర్భాశయాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గర్భధారణ అవకాశం చాలా తగ్గుతాయి.

5 / 7
గతంలో ఫెలోపియన్ ట్యూబ్‌లపై శస్త్రచికిత్స చేయించుకుని ఉంటే, హైడ్రోసల్పింక్స్ సంభవించే అవకాశం ఉంది. అలాగే ఎక్టోపిక్ గర్భధారణకు శస్త్రచికిత్స తీసుకున్నా హైడ్రోసాల్పిన్క్స్ సంభవించవచ్చు.

6 / 7
మహిళల్లో సంతానలేమికి మరొక సాధారణ కారణం హైడ్రోసాల్పింక్స్ సమస్య. ఇలాంటి వారికి IVF సిఫార్సు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ అది పూర్తిగా విజయవంతం కాకపోవచ్చు.

7 / 7
ఈ కేసులో సక్సెస్‌ రేటు 20-25 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు అంటున్నారు. హైడ్రోసల్పిన్క్స్‌ను అల్ట్రాసౌండ్ లేదా ఇతర ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేయవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్‌ల వాపును అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించవచ్చు.