Robotic Mules: భారత్ సైన్యంలో రోబోటిక్ మ్యూల్స్ .. వాటి ప్రత్యేకతలు ఏంటి.?

| Edited By: Prudvi Battula

Jan 17, 2025 | 9:48 AM

జనవరి 15, 2025న పూణేలో జరిగిన ఆర్మీ డే పరేడ్‌లో భారత సైన్యం రోబోటిక్ "మ్యూల్స్"ను ప్రదర్శించింది. పూణేలో మొదటిసారిగా ఈ కవాతు జరిగింది. సైన్యం యొక్క ఆధునీకరణ ప్రయత్నాలను హైలైట్ చేస్తూ రోబోటిక్ మ్యూల్స్ అనే మారుపేరుతో కూడిన క్వాడ్రుపెడల్ అన్ మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (Q-UGVలు) కవాతులో పాల్గొన్నాయి. అసలు వీటి ప్రత్యేకతలు ఏంటి.? ఈరోజు చూద్దాం.. 

1 / 5
ఈ రోబోలు సైనికులకు ప్రమాదాన్ని తగ్గించి సవాలుతో కూడిన వాతావరణంలో పనిచేసేలా రూపొందించబడ్డాయి. ఖడ్కీలోని BEG & సెంటర్ పరేడ్ గ్రౌండ్‌లో సదరన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో వాటిని ప్రదర్శించారు. GOC-in-C సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

2 / 5
రోబోటిక్ మ్యూల్స్ వాతావరణంలోనైనా సులువుగా పని చేస్తాయి. -40 నుండి +55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలలో పని చేయనున్న మ్యూల్స్. అవి విభిన్న భారతీయ భూభాగాలకు అనుకూలంగా ఉంటాయి మరియు దుమ్ము నిరోధక మరియు నీటి-నిరోధకత కలిగి ఉంటాయి.

3 / 5
రోబోటిక్ మ్యూల్ 15 కిలోల బరువును ఎత్తగలదు. భారత సైన్యానికి కావల్సిన వస్తువును చేరవేస్తాయి.రోబోటిక్ మ్యూల్ వేగంగా మెట్లు, నిటారుగా ఉన్న కొండలు, ఇతర అడ్డంకులను సులభంగా దాటగలదు. నీటి అడుగున కూడా పని చేస్తాయి. నదులు, వాగులు, వంకలు, ప్రవాహాలను కూడా సులభంగా దాటి సమర్దవంతంగా టార్గెట్ చేరుకుంటాయి.

4 / 5
రోబోటిక్ మ్యూల్‌కు ఎలక్ట్రో-ఆప్టిక్స్, ఇన్‌ఫ్రారెడ్ వంటి వాటిని గుర్తించే సామర్థ్యం ఉంది. శత్రువుల స్థానాన్ని గుర్తించేందుకు వీటిలో 360 డిగ్రీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో థర్మల్ కెమెరాలు, సెన్సార్లను అమర్చారు. ఈ ఆల్-టెర్రైన్ రోబోలు విభిన్న వాతావరణాలలో సైనికుల సామర్థ్యాన్ని మరియు భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. 

5 / 5
సరిహద్దులో మోహరించిన సైనికులకు చిన్న వస్తువులను తీసుకెళ్లడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. భారత సైన్యం నాల్గవ దశ ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ (EP) కింద జూన్ 2024లో 100 రోబోటిక్ మ్యూల్స్‌ను కొనుగోలు చేసింది. 