
పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా తయారు చేయడంలో ఎంతో సహాయం పడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పనిచేస్తుంది. చిటికెడు యాలకుల పొడి, పసుపు కలపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీటిని గోల్డెన్ మిల్క్‌గా అభివర్ణిస్తున్నారు.

ఈ గోల్డెన్ మిల్క్‌తో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తీవ్రమైన ఒత్తిడిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో పాటు పసుపు కలుపుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి విశ్రాంతి అందజేస్తాయి. అంతేకాకుండా జలుబు దగ్గు వంటి సాధారణ సమస్యలను నుంచి ఉపశమనం కలుగుతుంది.

కఫంతో బాధపడేవారు ఈ యాలకుల పాలను తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే కీళ్ళనొప్పులు, కండరాల సమస్యలతో బాధపడే వారు కూడా ఈ పాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగలు ఉన్నాయి. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే వారికి పసుపు, యాలకులతో చేసిన పాలు తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఏలకులు, పసుపు రెండూ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఏలకులు ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అయితే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి విశ్రాంతినిస్తాయి. పాలలో యాలకులు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో కూడా ఏలకులు ఉపయోగపడతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల, కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అజీర్ణాన్ని నివారిస్తుంది.