
తేనె, ఉసిరికాయతో కలిపి తీసుకోవడం వల్ల జుట్టు బలపడుతుంది. మీ జుట్టు బలహీనంగా, ఎక్కువగా రాలిపోతుంటే మీరు తేనె ఉసిరిని కలిపి తినవచ్చు.

ఉసిరికాయను తేనెతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఉసిరి తేనె కలయిక మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

ఉసిరి, తేనె కలయిక చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య నియంత్రిస్తుంది.

ఉసిరి ముక్కలను తేనెతో కలపండి. ఇది ఖాళీ కడుపుతో లేదా భోజనానికి 1 గంట ముందు లేదా తర్వాత క్రమం తప్పకుండా తినవచ్చు. మీరు దీన్ని ఒకసారి తయారు చేసి 10 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. (గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)