మీరు బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా..? మీ ఫిట్‌నెస్ విధానాన్ని కొనసాగించడం కష్టంగా ఉందా.? అవును అయితే, మీరు చింతించకండి. ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, వారంలో కనీసం నాలుగు రోజులు జిమ్‌కు వెళ్లాలని సిఫార్సు చేస్తారు. సరే, మనల్ని ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంచడంలో ఫిజికల్ వర్కౌట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది వాస్తవమే. కానీ, మన ఆహారం కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కూడా మన బరువు తగ్గించే అవకాశం ఉందని మీకు తెలుసా..? అటువంటి కూరగాయలలో ఒకటి క్యారెట్.