Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..

|

Sep 24, 2023 | 11:08 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

1 / 5
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

2 / 5
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో జోరు వర్షాలు కురుస్తున్నాయి.తూర్పుగోదావరి, కడప, అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలోని కంబాల చెరువు, సెంట్రల్ జైలు, దేవిచౌక్ గోకవరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. కడప జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. పెండ్లిమర్రి మండలం జోరుగా వాన పడుతుంది. తిప్పరాజుపల్లె రోడ్డులోని వంక ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

3 / 5
అయితే ఆ వంకలో చిక్కుకున్న ఆరుగురిని  గ్రామస్తులు కాపాడారు.. ఇటు శ్రీసత్యసాయి పుట్టపర్తిలోనూ రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. వరదతో వాగులు, వంకలను తలపిస్తున్నాయి రహదారులు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు చిత్రావతి నదిలో వరద పొటెత్తింది. దీంతో రాయవారిపల్లి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కోవెలగుట్టపల్లి వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

4 / 5
కాగా.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో సైతం మూడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్‌ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

5 / 5
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖరీప్ సీజన్ ప్రారంభమైన తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో వర్షాలు ప్రారంభమవడంతో రైతులు పనుల్లో బిజీ అవుతున్నారు.