South India Tour: వేసవి సెలవులలో ప్రకృతి అందాలను తిలకించాలంటే.. తప్పక సందర్శించాల్సిన 7 పర్యాటక ప్రాంతాలివే..

|

Apr 19, 2023 | 3:50 PM

వేసవి సెలవులను ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటున్నారా..? అయితే ప్రతి ప్రకృతి ప్రేమికుడికి గమ్యస్థానాలైన ఈ 7 ప్రాంతాలను తప్పక సందర్శించాల్సిందే. వీటి కోసం మీరు సుదూరాలకు వెళ్లనవసరంలేదు. ఈ ఉత్కంఠభరితమైన అందాలకు నిలయమైన పర్యాటక ప్రాంతాలు మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి.

1 / 7
తేక్కడి: పశ్చిమ కనుమలలో నెలకొని ఉన్న తేక్కడి వన్యప్రాణులకు స్వర్గధామం..పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యానికి నిలయం. జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూసే అవకాశాన్ని అందిస్తుంది  ఈ పర్యాటక ప్రాంతం. పెరియార్ సరస్సులోని ఏనుగులు, గేదెలు, పులులను చూడడానికి ఇక్కడ పడవ ప్రయాణం కూడా చేయవచ్చు.

2 / 7
కుమారకోమ్‌: మీరు సెలవులను ప్రశాంతంగా గడపాలనుకున్నట్లయితే కుమారకోమ్‌కు వెళ్లండి. కేరళలోని ఈ ప్రాంతం ప్రశాంతమైన జలమార్గాలకు, పక్షుల వీక్షణకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి హౌస్‌బోట్‌లో ప్రయాణించవచ్చు. ఇంకా ఇక్కడ కుమారకోమ్‌ పక్షుల అభయారణ్యం కూడా ఉంది.

3 / 7
మడికేరి: ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలువబడే మడికేరి ప్రాంత్రం కొండలు, పొగమంచు ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ అబ్బే జలపాతానికి ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఇంకా దుబరే ఎలిఫెంట్ క్యాంపును కూడా సందర్శించవచ్చు.

4 / 7
మున్నార్: కేరళలోని మున్నార్ విశాలమైన టీ ఎస్టేట్‌లు, సుందరమైన లోయలకు ప్రసిద్ధి. అంతరించిపోతున్న నీలగిరి తహార్‌ను గుర్తించడానికి ఇక్కడ ఉన్న తేయాకు తోటల గుండా నడవండి. ఇంకా ప్రకృతి అందాలను తిలకించేందుకు ఎరవికులం నేషనల్ పార్క్‌ని కూడా సందర్శించండి.

5 / 7
ఊటీ: టీ తోటలు, హిల్ స్టేషన్ వైబ్‌లకు ప్రసిద్ధి చెందిన ఊటీ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. విశాల దృశ్యాల కోసం కూడా నీలగిరి మౌంటైన్ రైల్వేలో ప్రయాణించవ్చు. అలాగే ఇక్కడ దొడ్డబెట్ట శిఖరానికి ట్రెక్ చేయవచ్చు. మీ భాగస్వామితో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాలలో ఇది కూడా ఒకటి.

6 / 7
హంపి: ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో  గుర్తింపు పొందిన హంపి 14వ శతాబ్దానికి చెందినది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ పర్యాటక ప్రాంతంలో పురాతన దేవాలయాలు, రాజభవనాలు, కోటలను చూడవచ్చు. హిస్టరీ గురించి తెలుసుకునేవారికి ఇది చక్కని టూర్ కాగలదు.

7 / 7
పాండిచ్చేరి: యూరిపయన్ శోభకు పేరుగాంచిన పాండిచ్చేరి దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఒక ప్రత్యేకమైన గమ్యస్థానం. ఈ సముద్ర తీర పట్టణం అందమైన బీచ్‌లు, విచిత్రమైన కేఫ్‌లు, ఫ్రెంచ్ కలోనియల్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఇక్కడ మీరు ప్రొమెనేడ్ బీచ్‌లో షికారు చేయవచ్చు. ఇంకా ఆధ్యాత్మిక అనుభవం కోసం అరబిందో ఆశ్రమాన్ని సందర్శించవచ్చు.