
Ktm 390 వీటిలో టాప్లో KTM 390 డ్యూక్ ఉంది. 399cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో 46 PS శక్తి, 39 Nm టార్క్‌ను అందిస్తుంది. 28.9 KMPL దీని మైలేజ్. ఇది 2.95 లక్షల రూపాయల ధరతో అద్భుతమైన పెర్ఫామెన్స్ టెక్నాలజీని అందిస్తుంది.

2వ స్థానంలో TVS Apache RTR 310 ఉంది. 312.12cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 35.08 bhp శక్తి , 28.7 Nm టార్క్‌ను అందిస్తుంది. 34.7 KMPL దీని మైలేజ్. ఇది 2,49,990 రూపాయల ధరతో బహుళ రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.

3వ స్థానంలో హస్క్‌వర్నా స్వార్ట్‌పిలెన్ 401 ఉంది. 398.63cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 46 PS శక్తి, 39 Nm టార్క్‌ను అందిస్తుంది. 29 KMPL దీని మైలేజ్. ఇది 2.93 లక్షల రూపాయల ధరతో ఆధునిక టెక్నాలజీని కలిగి ఉంటుంది.

4వ స్థానంలో బజాజ్ డామినార్ 400 ఉంది. 373.3cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 40 PS శక్తి, 35 Nm టార్క్‌ను అందిస్తుంది. 27 నుండి 30 KMPL దీని మైలేజ్. ఇది 2,75,711 రూపాయల ధరతో పెర్ఫామెన్స్, సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

టాప్ 5లో హోండా CB300R ఉంది. 286cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 31.1 PS శక్తి, 27.5 Nm టార్క్‌ను అందిస్తుంది. 30 KMPL దీని మైలేజ్. ఇది 2.40 లక్షల రూపాయల ధరతో నేవో-రెట్రో డిజైన్ కలిగిన ఆకర్షణీయమైన ఎంపిక.

6వ స్థానంలో హార్లే-డేవిడ్‌సన్ X440 ఉంది. 440cc గాలి-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో 27 bhp శక్తి, 38 Nm టార్క్‌ను అందిస్తుంది. 30 KMPL దీని మైలేజ్. ఇది 2.40 లక్షల రూపాయల ప్రారంభ ధరలో క్లాసిక్ హార్లే డిజైన్‌తో అందుబాటులో ఉంది.

7వ స్థానంలో యమహా MT-15 V2 ఉంది. 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో18.4 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన 45 kmpl ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది 1,70,583 నుంచి 1,75,280.00 రూపాయల వరకు ధరలో 3 వేరియంట్లు, 8 రంగులలో లబిస్తుంది.