Walnuts Benefits: రోజూ రెండు వాల్‌నట్‌లను ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

|

Dec 08, 2023 | 12:18 PM

డ్రై ఫ్రూట్స్ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ఎక్కువగా డ్రైఫ్రూట్స్‌ తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రోజూ ఒకటి లేదా రెండు వాల్ నట్స్ తినండి. ఇది అనేక సమస్యల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

1 / 6
మీ చర్మం కాంతివంతంగా ఉండటానికి మీరు మీ చర్మంపై రెండు మూడు చుక్కల వాల్‌నట్ ఆయిల్ రాసుకోవచ్చు. వాల్‌నట్‌ ఆయిల్‌ చేతిలో వేసుకుని వేళ్లతో మీ ముఖాన్ని స్మూత్‌గా మసాజ్ చేసుకోండి. మీకు కావాలంటే మీరు మీ ఫేస్ ప్యాక్‌లో రెండు నుండి మూడు చుక్కల వాల్‌నట్స్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

2 / 6
జుట్టు పెరుగుదలకు వాల్ నట్స్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది. మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నట్టయితే క్రమం తప్పకుండా రోజూ వాల్‌నట్స్ తీసుకోవటం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 6
గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తికి కూడా చాలా మంచిది. ప్రపంచంలో గుండె సంబంధిత వ్యాధులతో ఇటీవల ఎక్కువ మంది చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

4 / 6
Walnuts Benefits

Walnuts Benefits

5 / 6
వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇది మన మెదడుకు, జ్ఞాపకశక్తికి ఎంతో మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.గుండెకు మేలు చేస్తుంది.

6 / 6
రోజూ వాల్ నట్స్ తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. నిద్ర సమస్యలను అధిగమించడానికి మీరు మీ రోజువారీ ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవాలి.