
మన ఎముకలు, కండరాల ఆరోగ్యానికి విటమిన్ డి ఒక ముఖ్యమైన పోషకం.మన శరీరంలో విటమిన్ డి శాతం తగ్గిపోతే మనం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ లోపం వల్ల అలసట, మానసిక స్థితిలో మార్పులు, జుట్టు రాలడం, ఆకలి లేకపోవడం వంటి అనేక సమస్యలు వాస్తాయి.

ఇలాంటి సమస్యలను అదిగమించాలంటే మనం విటమిన్ డి కలిగిన ఆహారపర్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. సాల్మన్, మాకేరెల్, ట్యూనా, సార్డిన్స్, ట్రౌట్ వంటి కొవ్వుల చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.అలాగే విటమిన్ డి కోసం గుడ్డు పచ్చసొన కూడా మంచి ఎంపిక.. వీటిలో ఈ పోషకం మితమైన మొత్తంలో ఉంటుంది.

ఇవే కాకుండా నారింజ రసంలో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.కాబట్టి వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి విటమిన్ డి అభిస్తుంది. ఇవి ఈ విటమిన్ లోపం వల్ల కలిగే అనేక ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం కలిగిస్తాయి.

నిజానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైనంత మేర విటమిన్ డి లభిస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి సంశ్లేషణ చేయబడుతుంది. యూరోపియన్ దేశాలలో కనీసం 30 నిమిషాలు 3 రోజుల పాటు సూర్యరశ్మిలో ఉండటానికి అక్కడి పౌరులు ఆసక్తి చూపుతుంటారు.

ఈ పనులు చేసినప్పటికీ మీకు తగినంత విటమిన్ డి అందకపోతే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.వైద్యుల సూచనల మేరకు ఈ ఆహారంతో పాటు సప్లిమెంట్లు కూడా తీసుకోండి.(NOTE:ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)