శరీరంలో ఉండే ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి-12 ఒకటి. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ విటమిన్ ఎముకలు, కండరాలను నిర్మించడంలో, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ B-12 లోపం తలెత్తితే రక్తహీనత నుంచి ఎముకలు, కండరాల సమస్యలు, మానసిక స్థితి, మెదడు సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో విటమిన్ B-12 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి.