
ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతారు. శరీరంపై అనేక ప్రయోగాలు చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి కూడా వెనుకాడరు. అమెరికాకు చెందిన ఓ మహిళ అందంగా మారాలనే తపనతో ఏకంగా 59 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

నిజానికి ఆ మహిళ బార్బీ బొమ్మలా కనిపించాలనే కోరికతో అన్ని సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఈ విషయం తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.

ఈ మహిళ పేరు జెన్నీ లీ బర్టన్. ఆమె టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందినది. డైలీ స్టార్ యొక్క నివేదిక ప్రకారం.. జెన్నీ ఇప్పటివరకు తన శరీరంపై 3 లిప్ ఇంప్లాంట్లు, లైపోసక్షన్‌తో సహా వివిధ శస్త్రచికిత్సలు చేయించుకుంది.

ఇన్ని సర్జరీలు చేయించుకున్నా ఇప్పటికీ తన లుక్ పట్ల సంతోషంగా లేనని జెన్నీ చెప్పింది. బార్బీ బొమ్మలా కనిపించడం కోసం తన కుమార్తెను కూడా అస్సలు పట్టించుకోలేదని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.

తనకి కూతురు పుట్టగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం మొదలుపెట్టానని అందుకే తన ముఖం ఎలా ఉంటుందో తన కూతురికి కూడా తెలియదని జెన్నీ చెప్పింది.