
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఒక ఎలుగుబంటి హైవేపైకి వస్తుంది. తమిళనాడులోని గుడ్లూర్‌లో ఎలుగుబంటి అడవి నుంచి తిరుగుతూ రహదారిపై ట్రాఫిక్ చూసి ఆగిపోతుంది.

పర్వతాల మధ్యలో ఉన్న ఆ రహదారిపై కార్లు వేగంగా వెళుతుంటాయి. రెండు ఎలుగుబంట్లు పైనుంచి దిగి మరొక వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి.

వాటిలో ఒకటి ఆగిపోగా, మరొక ఎలుగుబంటి త్వరగా రోడ్డు దాటడం ప్రారంభిస్తుంది. అప్పుడు సడెన్‌గా ఒక కారు ఎదురుగా వస్తుంది. దీంతో ఎలుగుబంటి రోడ్డుపై ఆగిపోతుంది.

ఇలా రహదారిపై మధ్య ఉన్న ఎలుగుబంటిని చూసి, రోడ్డు మీద ఉన్న ప్రజలు నివ్వెరపోయారు.

ఎలుగుబంటి రోడ్డు దాటిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.