సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు.. వీటి సౌందర్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పాదాల గురించి అంతగా పట్టించుకోం. అందుకే పాదాలపై నల్లని ట్యాన్ పేరుకుపోయి, అందవిహీణంగా కనిపిస్తుంటాయి. పాదాలు కూడా చక్కటి మేనిఛాయతో మెరవాలంటే వంటింట్లో దొరికే పదార్ధాలతో ఇలా చేయండి..
పెరుగు.. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతోపాటు అందాన్ని సంరక్షించే గుణాలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఫేస్‌ప్యాక్స్, హెయిర్ ప్యాక్‌లుగా ఎక్కువగా పెరుగును ఉపయోగిస్తారు.
సూర్యరశ్మి వల్ల చర్మంపై పేరుకుపోయిన నల్లని ట్యాన్‌ను తొలగించడంలో పెరుగులో సమర్ధవంతంగా పని చేస్తుంది
రెండు స్పూన్ల పెరుగు తీసుకొని పాదాలకు రాసుకోవాలి. తర్వాత అరగంట పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి.
ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల ట్యాన్ తొలగిపోవడంతోపాటు, కాళ్ల పగుళ్లు సైతం తగ్గిపోతాయి. ఓసారి ట్రై చేసి చూడండి.. ఫలితం మీరే చూస్తారు.