వంట కోసం ఉపయోగించే నూనెలో కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో సంతృప్త కొవ్వు, మోనోశాచురేటెడ్ కొవ్వు, బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ సంతృప్త కొవ్వు పదార్థాలు ఉన్న నూనెలను వాడాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. బహుళ అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3, 6 కొవ్వులు కలిగిన నూనెలు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.