- Telugu News Photo Gallery Viral photos Most Expensive Birds: These are the world's most expensive birds, you will be shocked to hear the price!
Most Expensive Birds: ఈ పక్షులు చాలా ఖరీదైనవి.. కొనాలంటే ఆస్తులు కూడా అమ్మాల్సిందే..!
Most Expensive Birds: ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి ఖచ్చితంగా మురిసిపోయే ఉంటారు. అవి ఎగురుతున్న తీరు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కొందరు పక్షులపై ఇష్టంతో వాటిని పెంచుతారు కూడా. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పక్షులను కొనుగోలు చేసి, ఇంటికి తీసుకువస్తారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షులు ఉన్నాయని మీకు తెలుసా? వాటిని కొనాలంటే కొన్ని ఆస్తులు కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. అంత ఖరీదైన పక్షుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 29, 2023 | 4:11 PM

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షి రేసింగ్ పావురం. 2020లో అర్మాండో అనే రేసింగ్ పావురం 1.4 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 115 కోట్లు) అమ్ముడుపోయింది. అర్మాండో ఒక ఛాంపియన్ రేసర్. రేసింగ్ పావురాలను వాటి రేసింగ్ పోటీల కోసం పెంచుతారు. అవి చాలా దూరం ప్రయాణించడానికి శిక్షణ కూడా ఇస్తారు. గంటకు 60 మైళ్ల వేగంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటాయి. ప్రస్తుతం అత్యంత ఖరీదైన పక్షిగా అర్మాండో ప్రపంచ రికార్డు సృష్టించింది.

హైసింత్ మకా ప్రపంచంలోనే అతిపెద్ద చిలుక. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది 3 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. హైసింత్ మకావ్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. దీని ధర $10,000 (సుమారు రూ. 8 లక్షలు) వరకు ఉంటుంది.

బ్లాక్ పామ్ కాకాటూ: న్యూ గినియాలో కనిపించే పెద్ద చిలుక. ఇది తలపై నల్లటి ఈకలు, పెద్ద ముక్కు కలిగి ఉంటుంది. బ్లాక్ పామ్ కాకాటూ ధర $ 15,000 (సుమారు రూ. 12 లక్షలు) వరకు ఉంటుంది.

స్కార్లెట్ టానేజర్. ఇది ఉత్తర అమెరికాలో కనిపించే మధ్య తరహా సింగింగ్ బర్డ్. ఇది ప్రకాశవంతమైన ఎర్రటి ఈకలకు ప్రసిద్ధి చెందింది. స్కార్లెట్ టాన్నర్ల ధర $900 (సుమారు రూ. 74,000)గా ఉంది.

అయామ్ సెమానీ, ఇండోనేషియాలో కనిపించే అరుదైన కోడి జాతి. ఇది నల్లటి ఈకలు, నల్లటి చర్మం, నల్ల మాంసానికి ప్రసిద్ధి చెందింది. అయామ్ సెమానీ కోళ్లు చాలా ఖరీదైనవి. వాటి ధర $2,500 (సుమారు రూ. 2 లక్షలు) వరకు ఉంటుంది.




