uppula Raju |
Feb 14, 2022 | 9:27 AM
బాల్యం అనేది అందరికి ఒకలా ఉండదు. అందరికీ సాధారణ బాల్యం ఉండదు. కొంతమంది బాల్యం సాధారణంగా జరిగితే మరికొంతమంది ఇబ్బందులతో గడుపుతారు. అయితే కొన్ని విషయాలు గుండెపై లోతైన గాయాన్ని చేస్తాయి. వాటి నుంచి కోలుకోవడం కష్టమవుతుంది. బ్రిటన్‌కి చెందిన 26 ఏళ్ల వ్లాడ్ వాన్ కిట్ష్‌ది అలాంటి వృత్తాంతమే.
వ్లాడ్ వాన్ కిట్ష్ రూపాన్ని చూసి చిన్నప్పుడు అందరు ఆటపట్టించేవారు. స్కూల్లో పిల్లలు దెయ్యం అంటూ ఎగతాళి చేసేవారు. ఇవన్నీ వ్లాడ్ మనస్సుని ఎంతో గాయపరిచాయి. దీంతో పెద్దయ్యాక రాక్షసుడిలా మారాలనుకున్నాడు.
ది సన్ నివేదిక ప్రకారం.. వ్లాడ్ వాన్ కిట్ష్ తలపై కొమ్ములు పెట్టుకుంటాడు. అంతే కాకుండా పెద్ద గోళ్లు, పెద్ద పళ్లు, దట్టమైన పొడవాటి జుట్టుతో రాక్షసుడిలా ఉంటాడు.
వ్లాడ్ రాక్షసుడిగా కనిపించడానికి 3 నుంచి 4 గంటలు తయారవుతాడు. అలాగే బయటికి వస్తాడు.
ఇప్పుడు వ్లాడ్ రాక్షస రూపాన్ని ఇష్టపడటం ప్రారంభించాడు. భయానక రూపంలో కనిపిస్తున్నాడు. ఈ రూపాన్ని చూసి ప్రజలు కూడా భయపడతారు.