ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటి గురించి మనం తరచూ సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటూనే ఉంటాం. మీరెప్పుడైనా ఓ భారీ సైజ్ బంగాళదుంపను చూశారా.? అలాంటిది.. ఇలాంటిది కాదు దాదాపు 600 కిలోలు ఉంటుంది. అదేంటి బంగాళదుంపలు మీడియం సైజ్‌లో లేదా చిన్నగా దొరుకుతాయని అనుకుంటున్నారేమో.!
కానీ ఇక్కడొక భారీ సైజ్ బంగాళదుంప తయారవుతోంది. అది కూడా అమెరికాలో.. అయితే అది తినడానికి కాదులెండి.! దాని లోపల ఓ అందమైన ప్రపంచం ఉంది. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో ఓ విలాసవంతమైన హోటల్ నిర్మించబడింది. దీని వెలుపల భాగం చూడటానికి ఓ బంగాళదుంప మాదిరిగా ఉంటుంది. దీని ఆకారం అక్కడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ బంగాళదుంప ఆకారంలో ఉన్న హోటల్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీని ఇంటీరియర్ మొత్తం అద్బుతంగా తీర్చిదిద్దారు. ఈ హోటల్ అద్దె రోజుకు రూ. 18 వేలు పైమాట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇలాంటి ఆకారంలో హోటల్ నిర్మించడానికి ఓ కారణం లేకపోలేదు. ఇడాహోలో బంగాళదుంప చిప్స్ ఉత్పత్తి భారీగా జరుగుతుంది. ఆ రాష్ట్రం అందుకు బాగా ఫేమస్ అయింది. పర్యాటకులను ఆకర్షించే విధంగా అక్కడ బంగాళదుంప ఆకారంలో ఓ హోటల్‌ని నిర్మించారు.
ఈ హోటల్‌లో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు లేదా ఫ్యామిలీ బస చేయొచ్చు. ఇందులో బాత్రూమ్, వంటగది సౌకర్యం కూడా ఉంది. మీరే స్వయంగా వంట కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ హోటల్‌కి ఏసీ సౌకర్యం కూడా ఉంది.