
తన పొడవైన నల్లటి కురుల గురించి జపాన్ కు చెందిన రిన్ కంబే అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తన జట్టును చూసి.. ఎక్కువ మంది దెయ్యం జుట్టు అని టీజ్ చేసేవారని చెప్పింది. అయితే తన జుట్టు మాత్రం తనకు చాలా గర్వకారణం అని మురిసిపోతుంది.

జపాన్ రాజధాని టోక్యోకు చెందిన రిన్ కంబే మోడల్ కమ్ డ్యాన్సర్. అయితే రిన్ కు వృత్తి పరమైన గుర్తింపు కంటే పొడవైన నల్లటి జుత్తువలన వచ్చిన గుర్తింపు ఎక్కువని .. తన శిరోజాలే తనకు మంది పేరు తెచ్చిపెట్టాయని చెబుతుంది. అందుకనే తన జుట్టును గత 15 ఏళ్ల నుంచి కట్ చేయడం లేదని తెలిపింది.

రిన్ కంబే శిరోజాల పొడవు అక్షరాలా "ఆరు అడుగుల మూడు అంగుళాలు" గత 15 ఏళ్లనుంచి కట్ చేయని తన జుట్టు ను చూసుకుంటూ మురిసిపోతుంది. అంతేకాదు తన జుట్టు తనకు భావ వ్యక్తీకరణకు బలమైన ఆయుధం అని గర్వంగా చెబుతుంది. అమ్మాయికి జుట్టు ఎంత అందాన్ని ఇస్తుందో దెయ్యం జుట్టు అని టీజ్ చేస్తున్నవారికి ఏమి తెలుసు అని ప్రశ్నిస్తుంది.

అయితే జుట్టు ఇంత ఒత్తుగా పొడవుగా నల్లగా పెరగడానికి రిన్ రోజు ఎంత కష్టపడుతుందో కూడా చెప్పింది. జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగడానికి ప్రత్యేకంగా కుంకుమ పువ్వుతో తయారు చేసిన స్కాల్స్ క్రీమ్ ను రాసుకుంటానని తెలిపింది, అంతేకాదు తినే ఆహారంలో జుట్టుకు సంబంధించిన పోషక పదార్ధాలు ఉండేలా చూసుకుంటానని.. ఐరెన్, కాలిష్యం వంటి ఉండేలా జాగ్రత్తపడతానని తెలిపింది.

35 ఏళ్ల రిన్ కంబే 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించారట.. అప్పటి నుంచి ఇక తన జుట్టును కట్ చేయడం మానేశారట. అప్పటి నుంచి జుట్టు బాగా పెరగడం గమనించిన రిన్ దానికి పోషకాలు అందేలా సంరక్షణ చర్యలు తీసుకున్నారు.. ఇప్పడు ఆమె జుట్టుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా