- Telugu News Photo Gallery Viral photos Heres the reason why women are sharing images of themselves in ripped jeans across india
Ripped Jeans: ట్విట్టర్‌లో గళమెత్తిన నారీమణులు.. ఉత్తరాఖండ్ సీఎం కామెంట్స్‌పై చిరిగిన జీన్స్ ఫొటోలతో నిరసన
ripped jeans movement in india: నేటి యువత మోకాళ్ల వద్ద చిరిగిన జీన్స్‌తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు
Updated on: Mar 19, 2021 | 6:54 PM

నేటి యువత మోకాళ్ల వద్ద చిరిగిన జీన్స్‌తో దర్శనమిస్తోందని, ఇది మన సంస్కృతికి చిహ్నమా అంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా మహిళలు, యువతులు ఈ విధమైన చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని, కుటుంబంలో తమ పిల్లలకు వీరు ఇలాంటి వాతావరణాన్ని కల్పించడం సబబా తీరత్ సింగ్ రావత్ ప్రశ్నించారు.

ఇలాంటి సంస్కృతి.. మన సంస్కృతి కాదని.. హుందా పరిస్థితులను కల్పిస్తాయని అనుకోవడం లేదని.. ఈ మహిళాలోకం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందంటూ మూడు రోజుల క్రితం డెహ్రాడూన్లో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ వర్క్ షాప్ లో తీరత్ సింగ్ మాట్లాడారు.

ఇలాంటి మహిళలు సమాజంలోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామంటే.. వారిచ్చే సందేశాలకు విలువ ఉంటుందా అని ఆయన సీఎం అభిప్రాయపడ్డారు. మన సొసైటీకి, మన పిల్లలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని.. కానీ దీనికి విరుద్దంగా జరుగుతుందంటూ పేర్కొన్నారు.

ముఖ్యంగా మోకాళ్ళను నగ్నంగా చూపడంపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు ఇది మన కల్చర్ కాదని, విదేశాల్లోని వారు మనదేశపు యోగా, వస్త్రధారణ చేస్తుంటే.. మనం నగ్నత్వం వైపు పరుగులు పెడుతున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఒక స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్న ఓ మహిళే ఈ విధమైన జీన్స్ ధరించిందని.. ఇది చూసి షాక్ తిన్నానంటూ పేర్కొన్నారు. ఈ మహిళ ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తుందని పేర్కొన్నారు.

మోకాళ్ళను నగ్నంగా చూపడం, ధనికుల్లా కనబడడానికి తహతహలాడడం..ఇలాంటివి మనం మన పిల్లలకు నేర్పుతున్నామని.. కుటుంబం నుంచే పరివర్తన, ప్రవర్తన మారాలంటూ పేర్కొన్నారు.

అయితే సీఎం తీరత్ సింగ్ రావత్ కామెంట్స్‌పై ఇటు రాజకీయ నాయకులు, అటు మహిళలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. తీరత్ సింగ్ రావత్ మహిళల పట్ల ఏం చెప్పదలుచుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు చిరిగిన జీన్స్‌లు ధరించిన ఫొటోలను సెలబ్రిటీలు ట్విట్టర్, సోషల్ మీడియాలల్లో షేర్ చేస్తున్నారు. మా స్వేచ్ఛను ప్రశ్నించే అధికారం తమకు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదిలాఉంటే.. తిరత్ సింగ్ కామెంట్స్ ఇటు దేశంతో పాటు అంతర్జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత సమాజంలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడటం ఏంటంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి.




