Ravi Kiran |
Updated on: Mar 19, 2021 | 7:38 PM
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఓ జపనీస్ యంగ్ మోటార్ బైక్ రైడర్.. చాలా అందంగా ఉందని పడిపోతే.. ఇక అంతే.. ఎందుకంటే ఈమె నిజానికి ఓ 50 ఏళ్ల మగాడట.
ఆశ్చర్యపోయారా.! మీలాగే ఈ నిజం తెలుసుకున్న ఆమె ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఇటీవల 'ఆమె' బైక్ ముందు తీసుకున్న ఫోటో అనుమానాస్పదంగా ఉండటంతో కొందరు అభిమానులు శల్య పరీక్ష చేశారు. దీనితో అసలు నిజం బయటపడింది.
ఆమె అమ్మాయి కాదని.. నడివయసులో ఉన్న పురుషుడని తేలింది.
సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా ఆమె బండారం బయటపడింది. ఫిబ్రవరి 11వ తేదీన ఆమె తీసుకున్న ఫోటోల్లో బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో ఆమె 'అతడిని' పట్టించింది.
అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అతగాడు వివరించాడు. సోషల్ మీడియాలో తనను 'అంకుల్' అని పిలుస్తున్నారని.. అది నచ్చక తన ఫోటోను అబ్బాయిలా యాప్స్ ద్వారా మార్చుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఇలా చేసింది జస్ట్ ఫన్ కోసమని.. మరెలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశాడు.