Balaraju Goud |
Mar 24, 2021 | 3:17 PM
భారీ కళింగ సర్పానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
కర్ణాటకలోని ఒక అటవీ ప్రాంతంలో చెట్టుపై ఒక పెద్ద పాము వేలాడుతూ కనిపించిందని భారత అటవీ సేవల అధికారి సుశాంత నందా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కళింగ సర్పాన్ని బంధించిన అటవీ అధికారులు దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలివేశారు.
దాదాపు 14 అడుగుల పొడువున్న కళింగ సర్పం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించింది.
అది మూడు రోజులుగా ఒకే చెట్టుపై ఉంది. అయితే ప్రస్తుతం దానిని బంధించారు. దాని బరువు 9 కిలోల కన్నా ఎక్కువగా ఉంది.