
ఓ వ్యక్తి మృతికి కోడి కారణమైంది. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మరి ఎవరిని అరెస్టు చేయాలి? ఇంకేం ఆలోచనలేకుండా పోలీసులు కోడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఏ1 కోడి రాజాను స్టేషన్‌లో కట్టేశారు. కాసేపు సెల్‌లో, మరికేసేపు చెట్టుకిందకు మార్చేస్తున్నారు.

ఇక స్వేచ్ఛను కోల్పోయిన కోడిపుంజు.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తిస్తోంది.

జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు.