
ఇప్పుడు ఇంట్లోని మెట్ల కింద దేవుని రూమ్ నిర్మించడం ట్రెండ్ అయిపోయింది. అయితే వాస్తు ప్రకారం ఇంటిలోప మెట్లు ఉండటమే మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇంటిలోపల మెంట్లు నిర్మించుకుంటున్నారు.

అంతేకాకుండా ఇంట్లోని మెట్ల కింద ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ పూజ గది ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఇలా ఇంటిలోపల మెట్ల కింద పూజ గది ఉండటం మంచిది కాదు అని వాస్తు శాస్ద్రం చెబుతుంది. ఇది ఇంటికి చాలా అశుభం అంట. ఎందుకంటే? దీనికి ముఖ్య కారణం మనం ఇంటిలోప మెట్లు ఎక్కడం అంటే మన పాదాలు మెట్లపై పడుతుంటాయి.

అయితే పూజ గది మెట్ల కింద ఉండి , మీరు మెట్లు ఎక్కడం అంటే పూజ గది పై నుంచి మీరు నడవడం ఇది సరైనది కాదు అంటున్నారు పండితులు. దీని వలన జీవితంలో అనేక సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందంట. అందుకే పూజగది ఎప్పుడూ మెట్ల కింద ఉండరాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అంతే కాకుండా ఇంట్లో మెట్ల కింద పూజ రూమ్ ఉండటం వలన ఇంట్లో ప్రతి కూలతను సృష్టిస్తుందంట. మెట్ల కింద ఆలయాన్ిన ఉంచడం వలన ఇంట్లో కుటుంబ సమస్యలు తలెత్తుతాయంట.అలాగే వాస్తు దోషాలు కూడా ఏర్పడుతాయంట. ఇది కుటుంబ సభ్యుల విజయానికి ఆటకం కావచ్చు, అంతే కాకుండా మెట్ల కింద గుడి ఉండటం వలన ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు పండితులు.

అయితే మెట్ల కింద పూజ గది ఉండి, ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, మెట్ల కింద గుడి ఉంటే, ఆ స్థలం నుండి గుడిని కూల్చివేసి ఇంటికి తూర్పు దిశలో పూజ రూమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిదంట. నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.