- Telugu News Photo Gallery Vastu Tips: Do you know which direction is best to place a water purifier in the house?
వాస్తు టిప్స్ : ఇంట్లో వాటర్ ఫ్యూరిఫైయర్ ఏ దిశలో ఉండటం మంచిదో తెలుసా?
వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. ముఖ్యంగా ఇంటిలో కొన్ని వస్తువులను సరైనా దిశలో పెట్టడం వలన ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ ఏవైనా వస్తువులు తప్పు దిశలో పెట్టడం వలన వాస్తు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంటున్నారు, వాస్తు నిపుణులు.
Updated on: Nov 08, 2025 | 5:54 PM

వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. ముఖ్యంగా ఇంటిలో కొన్ని వస్తువులను సరైనా దిశలో పెట్టడం వలన ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ ఏవైనా వస్తువులు తప్పు దిశలో పెట్టడం వలన వాస్తు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంటున్నారు, వాస్తు నిపుణులు.

చాలా మంది ఇంటిలో ఎలాక్ట్రానిక్ వస్తువులను కొన్ని సార్లు తప్పుడు దిశలో పెడుతుంటారు. ముఖ్యంగా వాటర్ ఫ్యూరీ ఫైయర్ విషయంలో చాలా తప్పులు చేస్తుంటారు. వాస్తు ప్రకారం కాకుండా, తమకు నచ్చిన ప్లేసెస్‌లో పెట్టుకుంటారు. కానీ ఇది మంచిది కాదంట.

వాస్తు శాస్త్రం ప్రకారం, వాటర్ ఫ్యూరిఫైయర్ ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు పెట్టడం చాలా మంచిదంట. ఉత్తరం వైపు వాటర్ ఫ్యూరిఫైయర్ పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అంతే కాకుండా సంపద కూడా పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా, దక్షిణ వైపు వాటర్ ఫ్యూరిఫైయర్ పెట్టుకోవడం కూడా మంచిదే అని చెబుతున్నారు నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను ఈశాన్యం వైపు పెట్టకూడదంట. దీని వలన ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడటమే కాకుండా, అప్పుల బాధలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా టీవీని ఎప్పుడూ కూడ పడమర వైపు పెట్టకూడదంట.

అలాగే చాలా మంది వాటర్ ఫ్యూరిఫైయర్‌ని ఈశాన్యంలో పెట్టకూదంట. ఇది ఇంటిలోని సమస్యలకు కారణం అవుతుంది. అనేక ఇబ్బందులను తీసుకొస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే వాటర్ ఫ్యూరి ఫైయర్ విషయంలో తప్పకుండా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలంట.