చినజీయర్‌ స్వామి, మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ తోడ్పాటు అభినందనీయం: పీయూష్‌ గోయెల్‌

|

Jun 30, 2024 | 8:20 PM

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తిని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ దర్శించుకున్నారు. అద్భుతమైన క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామీజీ కృషిని , మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు తోడ్పాటును కేంద్రమంత్రి అభినందించారు..

1 / 5
ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తిని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ దర్శించుకున్నారు. అద్భుతమైన క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్‌ స్వామీజీ కృషిని , మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు తోడ్పాటును కేంద్రమంత్రి అభినందించారు.

2 / 5
కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ శంషాబాద్‌లో ఉన్న ముచ్చింతల్‌ శ్రీరామనగరాన్ని సందర్శించారు. సమతా మూర్తిని ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శ్రీశీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామీ ఆశీస్సులు తీసుకున్నారు.

3 / 5
భారతీయతకు , అధ్యాత్మికతకు ఈ క్షేత్రం అద్దం పడుతుందన్నారు. ఈ క్షేత్రాన్ని ప్రధాని మోదీ కూడా దర్శించిన విషయాన్ని గుర్తు చేశారు పీయూష్‌ గోయెల్‌

4 / 5
స్వామీజీ ఎంతో శ్రమతో ఈ అధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావుకు నా శుభాకాంక్షలు. టీవీ9 సంస్థ ఈ క్షేత్రాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించింది. రామానుజ స్వామీజీ సిద్దాంతాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని మంత్రి అన్నారు.

5 / 5
స్వామీజీ ఆశీస్సులతో భారత్‌ను 2047 నాటికి  అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుతామన్న నమ్మకం ఉంది. వికసిత్‌ భారత్ , ఆత్మ నిర్భర్‌ భారత్‌ , సంవృద్ధి భారత్‌గా దేశం మారుతుందని మంత్రి పేర్కొన్నారు. అధ్యాత్మిక క్షేత్రాల పరిరక్షణకు మైహోమ్‌ సంస్థ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు చేస్తున్న కృషిని పీయూష్‌ గోయెల్‌ కొనియాడారు.