సడెన్‌గా బరువు తగ్గుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రమాదకర జబ్బులకు సంకేతం కావొచ్చు
అధిక బరువు ఉండటం అస్సలు మంచిది కాదు. బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే అనవసరంగా బరువు కోల్పోవడం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
Updated on: Jan 09, 2023 | 8:53 PM

అధిక బరువు ఉండటం అస్సలు మంచిది కాదు. బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే అనవసరంగా బరువు కోల్పోవడం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

ఊబకాయం ఉంటే, గుండె సమస్యలు, గుండె జబ్బులు, మధుమేహం, ఒత్తిడి, కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతాయి. బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మీరు ఎటువంటి ప్రయత్నం లేకుండా ఒక నెల లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో 10 శాతం బరువు కోల్పోతే, మీరు జాగ్రత్తగా ఉండాలి.

మధుమేహం అనేది బరువు తగ్గడానికి ముందస్తు సూచన. యువతలోనూఈ సమస్య ఎక్కువగా ఉంది. మధుమేహం బాధితులు చాలా త్వరగా బరువు కోల్పోతారు. అలాగే రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు వెళుతుంటారు.

Weight Loss

శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా బరువు తగ్గవచ్చు. ఈ రోజుల్లో చాలా మందికి టీబీ వస్తోంది. బరువు తగ్గడం దీని లక్షణాల్లో ఒకటి. కాబట్టి ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.