G20 Summit: అక్షరధామ్ ఆలయంలో భార్యతో కలిసి రిషి సునక్ పూజలు.. హిందువుగా గర్విస్తున్నా.. బ్రిటన్ ప్రధాని

|

Sep 10, 2023 | 11:54 AM

G20 సమ్మిట్‌ కోసం భారత్ లో తొలిసారి అడుగు పెట్టిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. రిషి దంపతులకు  అక్షరధామ్ ఆలయ సాధువులు ఘన స్వాగతం పలికారు. అక్షరధామ్ ఆలయంలో తమ బృందంతో కలిసి ప్రార్థనలు చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో గడిపారు.

1 / 8

2 / 8
ముందుగా అక్షరధామ్ ఆలయ నిర్మాత ప్రముఖ స్వామీజీ మహారాజ్ విగ్రహం ముందు సాధువులు వేద మంత్రాలు పఠిస్తూ రిషి మణికట్టుకు రక్షా సూత్రం కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

3 / 8
 రిషి తన భార్య అక్షతతో కలిసి  స్వామినారాయణుని విగ్రహం ముందు జరిపిన ప్రార్థనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నీలకంఠ స్వామికి ప్రతిష్ఠాపనకు వచ్చారు. వైదిక పద్ధతి ప్రకారం జలాభిషేకం అనంతరం సాధువులతో ఆధ్యాత్మిక చర్చలు జరిపారు.

4 / 8
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి తమ బృందంతో కలిసి ప్రార్థనలు చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో గడిపారు. అక్షరధామ్ ఆలయ అధికారి జ్యోతింద్ర దవేతో కలిసి రిషి ఆలయంలోని ప్రతి విగ్రహాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, హారతి కూడా ఇచ్చారు. 

5 / 8
అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించడం తనకు చాలా సంతోషంగా ఉందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్  చెప్పారు. అంతేకాదు తనకు ఎప్పుడు వీలు దొరికినా ఇక నుంచి ఈ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించడానికి వస్తానని అన్నారు. 

6 / 8
ఆలయానికి  రిషి దంపతులు వెళ్లనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సునక్ అక్షరధామ్ ఆలయ సందర్శన నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. నియంత్రిత జోన్ 2 అమలు చేయబడిందని, ISBT కశ్మీర్ గేట్ నుంచి సరాయ్ కాలే ఖాన్ మధ్య రింగ్ రోడ్‌లో బస్సులు నడవవని ముందుగానే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

7 / 8
ఆలయ సందర్శనకు ముందు సునక్ మాట్లాడుతూ తాను హిందువుగా గర్విస్తానని.. రాఖీ పండగను జరుపుకుంటానని చెప్పారు. తాను హిందువుగా పుట్టానని.. అదే విధంగా పెరిగాను. అలానే ఉన్నాననంటూ చెప్పారు. తాను భారత్ లో ఉండనున్న రెండు రోజులు ఇక్కడ ఉన్న ఒకొక్క మందిరాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు సునక్ వార్తా సంస్థ ANIతో అన్నారు.

8 / 8
రిషి సునక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి G20 సమ్మిట్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చారు. ఈ దంపతులకు కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే .. జై సియారామ్‌తో స్వాగతం పలికారు. దంపతులకు రుద్రాక్ష పూసలు, భగవద్గీత కాపీ మరియు హనుమాన్ చాలీసాను బహుకరించారు.  