
తులసి పొడి, నిమ్మ రసం, పెరుగుతో ఫేస్ ప్యాక్: 2 టీస్పూన్ల తులసి పొడిలో 1 టీస్పూన్ నిమ్మరసం బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మకాయ నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.

తులసి ఆకుల పేస్ట్, పెరుగు ఫేస్ ప్యాక్: 8-10 తులసి ఆకులను గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా పెరుగును బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు ఒక సహజమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది చర్మం మీద మృత కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.

తులసి, వేప నూనె ఫేస్ ప్యాక్: 2 చెంచాల తులసి పొడిలో రెండు చెంచాల వేపనూనె కలిపి ముఖానికి రాసుకుని రాత్రి నిద్రపోండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

తులసి, క్రీమ్ ఫేస్ ప్యాక్: 1 టీస్పూన్ క్రీమ్, 1 టీస్పూన్ తులసి పొడిని బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రీమ్ లోపలి నుండి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

తులసి, జోజోబా ఆయిల్, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్: ఒక చెంచా తులసి ముద్దలో ఒక చెంచా ముల్తానీ మిట్టి, అర చెంచా జోజోబా నూనె మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. జోజోబా ఆయిల్ చర్మానికి పోషణనిస్తుంది. ముల్తానీ మిట్టి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

తులసి, తేనె ఫేస్‌ప్యాక్: 15-20 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి అందులో 1 టీస్పూన్ తేనెను బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. తేనె చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఇది మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని తేమ చేస్తుంది.