
పనులు, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, పిల్లల చదువుపై ఒత్తిడి ఇలా నిద్రలేమికి చాలా కారణాలున్నాయి.

ನಿఅలారంను సాధారణ మేల్కొనే సమయానికి సెట్ చేయండి. ఆపై ప్రశాంతంగా నిద్రపోండి. అదేపనిగా గడియారం చూస్తూ ఉంటే మరింత ఒత్తిడి కలుగుతుంది.

నిద్రవేళకు అరగంట ముందు గది కిటికీలు తెరిచి ఉంచండి. ఇది మీకు సౌకర్యవంతమైన నిద్ర వాతావరణాన్ని అందిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మృదువైన సంగీతాన్ని వినండి.

పడుకునే ముందు కెఫిన్ పానీయాలు లేదా ఆల్కహాల్ తాగవద్దు. టీ, కాఫీలు శరీరంలో కెఫిన్‌ను ఎనిమిది గంటల వరకు ఉంచుతాయి. దీనివల్ల సరిగా నిద్రపట్టదు

ఎలక్ట్రానిక్స్ పరికరాల నుండి వచ్చే నీలి కాంతి మీ సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తుంది. క్రమంగా ఇది నిద్రలేమికి కారణమవుతుంది. కాబట్టి పడుకునే ముందు ఒక గంట పాటు మీ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్లకు దూరంగా ఉండండి.

భోజనానికి, నిద్రకు మధ్య గ్యాప్ తీసుకోవడం చాలామంచిది. ఇది మీ శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి అనుమతిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది

పని, భోజనం, వ్యాయామం, నిద్ర కోసం ఒక టైమ్‌టేబుల్‌ను సెట్ చేసుకోండి. రోజూ కచ్చితంగా దీనిని పాటించేలా ప్రణాళిక వేసుకోండి.