Jammu Kashmir: భూతాల స్వర్గాన్ని శీతాకాలంలో చూడడం ఓ అద్భుతం.. ఈ 7 ప్రదేశాల అందాలను వర్ణించ తరమా..!

|

Dec 07, 2023 | 11:40 AM

స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే భారత దేశంలోని జమ్మూ కశ్మీర్ కు వెళ్లాల్సిందే.  భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ దేశంలోని ఉత్తరాన ఉన్న పర్యాటక ప్రదేశం. 'హెవెన్ ఆన్ ఎర్త్' అని ఖ్యాతిగాంచింది. పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, స్పష్టమైన నీలి ఆకాశం, మంచు కొండలు మనల్ని పిలుస్తున్నాయన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాలు మాత్రమే కాదు బోటింగ్ లేదా స్కీయింగ్  చేయాలనుకుంటే మంచి అనుభూతినిస్తాయి. 

1 / 8
ప్రభుత్వ డేటా ప్రకారం 2022లో 1 కోటి మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం మరో 75 పర్యాటక ప్రాంతాలను కేటాయించింది. కనుక జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లేవారికి చూడదగిన సుందరమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..   

2 / 8
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో సందర్శించాల్సిన మొదటి నగరం శ్రీనగర్. శ్రీనగర్‌ను జమ్మూకశ్మీర్ కు వేసవి రాజధాని అని కూడా పిలుస్తారు. అందమైన దాల్ సరస్సుకు ప్రసిద్ధి చెందింది. దాల్ సరస్సులోని షికారాల్లో రైడ్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. తేలియాడే బోట్ల మీద షాపింగ్ కూడా చేయవచ్చు. అంతేకాదు కాశ్మీర్ హస్తకళలు, ఆహారం కోసం స్థానిక మార్కెట్‌లు, స్థానిక ఆహారాన్ని రుచి చూడడానికి వెళ్లండి.

3 / 8
గుల్మార్గ్: స్కీయింగ్ చేయడానికి ఇష్టపడే వారికి సరై ఎంపిక గుల్మార్గ్. శీతాకాలంలో గుల్‌మార్గ్‌కి వెళ్లి స్కీయింగ్ చేయండి. మంచుతో నిండిన ఇక్కడ కుటుంబంతో ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ గడిపే సమయం మీ జీవితంలో ఉత్తమం అని అంటారు. అయితే వేసవిలో గుల్మార్గ్ ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ ను ఆస్వాదించవచ్చు.   

4 / 8
పహల్గామ్: 'గొర్రెల లోయ'గా పిలువబడే పహల్గామ్ చుట్టూ దట్టమైన అడవులు, సహజమైన నదులు, అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అంతేకాదు పహల్గామ్ నుంచి అమర్‌నాథ్ యాత్రను ప్రారంభిస్తారు. ప్రకృతి అందాలకు గొప్ప ప్రదేశం. 

5 / 8
సోన్ మార్గ్: భూతాల స్వర్గం సోన్ మార్గ్. ఇది చాలా ఎత్తులో ఉంది. రంగురంగుల పూలతో అలంకరించబడిన పచ్చిక భూమి ఇంద్ర ధనస్సులా కనువిందు చేస్తుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగులకు ఇష్టం. ఇక్కడ పర్వతాలు, నదీనదాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. అద్భుతమైన సౌందర్య చిత్రాలను బంధించడానికి కెమెరాలతో వెళ్లండి!

6 / 8
వైష్ణో దేవి ఆలయం: తీర్థయాత్ర కోసం ప్లాన్ చేస్తుంటే త్రికూట పర్వతాల్లో ఉన్న వైష్ణో దేవి ఆలయానికి వెళ్లండి. ఈ ఆలయం వైష్ణో దేవికి అంకితం చేయబడింది. ఇది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయానికి వెళ్లడం ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రదేశం చాలా సుందరంగా ఉంటుంది.

7 / 8
పట్నిటాప్: జమ్మూ కశ్మీర్ లోని అందమైన హిల్ స్టేషన్. ఎత్తైన పర్వతాలు అందమైన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తాయి. పిక్నిక్‌లు, పారాగ్లైడింగ్‌లకు ఇది గొప్ప ప్రదేశం.

8 / 8
దచిగామ్ నేషనల్ పార్క్: సాహస యాత్రను ఇష్టపడేవారైతే దచిగామ్ నేషనల్ పార్క్‌ని సందర్శించండి. ఈ జాతీయ ఉద్యానవనం అంతరించిపోతున్న హంగుల్ జింకలతో పాటు ఇతర ప్రత్యేకమైన హిమాలయ జంతు జాలానికి నిలయం.