
కాశ్మీర్: భూతల స్వర్గంగా భావించే కాశ్మీర్ కూడా వేసవి కాలంలో పెళ్లి చేసుకోవడానికి మంచి ప్లేస్. ఇక్కడ చల్లని వాతావరణం, ప్రకృతి మనసుని ఆకట్టుకుంటాయి. ఈ ప్రదేశంలో వివాహం చేసుకున్న తర్వాత.. ఇక్కడే హనీమూన్‌ను ఏర్పటు చేసుకోవచ్చు.

కూర్గ్: పచ్చదనంతో, అద్భుతమైన ప్రకృతితో కళకళలాడే కూర్గ్‌లో పెళ్లి చేసుకోవడం ఓ విభిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ప్రదేశం ప్రశాంతగా ఉండి..సౌకర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ వాతావరణం, ప్రదేశం సౌకర్యాలు వివాహం చేసుకోవడానికి ఉత్తమ ఎంపిక.

మహాబలేశ్వర్: కొన్నిసార్లు పరిస్థితుల కారణంగా, కొంతమంది వేసవిలో వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎండ వేడి, చెమట వంటి అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో ముంబైకి సమీపంలోని శీతల ప్రాంతమైన మహాబలేశ్వర్‌లో వివాహం చేసుకోవచ్చు.

రుషికేశ్: మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఈ హిల్ స్టేషన్ అత్యంత అందమైన ప్రదేశం. ఈ ప్రదేశం వేసవి కాలంలో దేశంలోనే బెస్ట్ వెడ్డింగ్ ప్లేస్ గా ఖ్యాతిగాంచింది. ఇక్కడ వాతావరణం చాలా వరకు చల్లగా ఉంటుంది. కనుక వేసవిలో ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఉత్తమం.

సిమ్లా: ఇది దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ప్రేమికులు సిమ్లా టూర్ ను ఎంజాయ్ చేస్తారు. అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య వివాహం చేసుకోవడానికి సిమ్లా వేసవి లో మంచి ఎంపిక