తక్కువ ఖర్చుతో హనీమూన్ ట్రిప్..! కొత్త జంటల కోసం అద్భుతమైన లొకేషన్లు..!

|

Apr 04, 2025 | 1:46 PM

హనీమూన్ అనేది కొత్తగా పెళ్లైన జంటల జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్రతి జంట ఆకాంక్షిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ ఎక్కువ ఖర్చు చేయలేరు. అలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్‌లో అందమైన, శాంతియుతమైన హనీమూన్ ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్ని భారత్‌లో ఉండగా, కొన్ని విదేశాల్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
శ్రీలంక.. శ్రీలంక కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ అనుభూతులను అందించే ప్రదేశం. ఇక్కడ అందమైన టీ తోటలు, హిరికెటియా (Hiriketiya), మిరిస్సా (Mirissa) వంటి బీచ్‌లు కొత్త జంటలకు శాంతియుత అనుభవాన్ని ఇస్తాయి. ఇది కేవలం ప్రకృతితోనే కాదు, సంస్కృతితో కూడిన ప్రదేశం కూడా. బౌద్ధ మత ఆలయాలు, పురాతన కోటలు చూసి ఆనందించవచ్చు. టికెట్లు, వసతి అన్నీ చౌకగా లభిస్తాయి.

2 / 5
కేరళ.. ప్రపంచంలోనే హనీమూన్ స్పాట్‌గా గుర్తింపు పొందిన ప్రదేశం కేరళ. బ్యాక్ వాటర్స్‌, హౌస్ బోట్ ప్రయాణాలు, పచ్చటి ప్రకృతి, అసాధారణమైన సౌందర్యం, మంత్రముగ్ధులను చేసే వాతావరణం, ఆత్మసంతృప్తిని కలిగించే ప్రశాంతతను అందిస్తాయి. అలప్పుఝా (Alappuzha), మున్నార్‌, థెక్కడి (Thekkady ) లాంటి ప్రదేశాల్లో నివాసం సులభంగా తక్కువ ధరలకే లభిస్తుంది. శాంతంగా, ప్రేమగా గడిపే సమయం కోసం కేరళ సరైన ఎంపిక.

3 / 5
ఇండోనేషియా బాలి.. ఇండోనేషియాలో ఉన్న బాలి ఐలాండ్ అందమైన కొండలు, బీచ్‌లు, ఆలయాలతో ప్రసిద్ధి. బాలి ప్రయాణం తక్కువ ఖర్చుతో లగ్జరీగా ఫీలయ్యేలా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉబుడ్ రైస్ టెర్రసెస్‌, టెంపుల్‌లు, వాయిస్ ఫారెస్ట్ లాంటి ప్రదేశాలు కొత్త జంటల మనసును దోచుకుంటాయి. హోటల్స్‌, రిసార్ట్స్, ట్రావెల్ ప్యాకేజీలు అన్నీ బడ్జెట్‌కు తగ్గట్టుగా అందుబాటులో ఉంటాయి.

4 / 5
గోవా.. గోవా అంటేనే బీచ్‌లు, సంతోషం, సందడి. హనీమూన్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఇక్కడ లభిస్తాయి. ఇసుక తీరాలు, రాత్రివేళ కాంతుల వెలుగు, మ్యూజిక్ పర్ఫార్మెన్సులు.. ఇవన్నీ కొత్త జంటకు మంచి అనుభవాన్ని ఇస్తాయి. గోవాలో వసతి, భోజనం అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉంటాయి. బీచ్‌లపై సేదతీరడం, స్కూటీపై చక్కర్లు కొట్టడం, కాండెల్ లైట్ డిన్నర్ చేయడం వంటివి హనీమూన్‌ను మరింత రమణీయంగా మార్చుతాయి.

5 / 5
థాయిలాండ్.. థాయిలాండ్‌లోని బ్యాంగ్ కాక్, పటాయా, ఫుకెట్ లాంటి ప్రదేశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్ చేసే లొకేషన్లు. షాపింగ్, బీచ్ వాక్స్‌, థాయ్ స్పా, నైట్ మార్కెట్లు.. ఇవన్నీ కొత్త జంటకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ట్రావెల్ ప్లానింగ్ సరిగ్గా చేసుకుంటే ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్ అన్నీ చౌకగా పొందవచ్చు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.