
ఈ కాలం లో చాలా మంది జుట్టుకు అసలు నూనెనే పెట్టరు. కానీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే మాత్రం రెగ్యులర్ గా జుట్టుకు నూనెను పెట్టాలి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా చేయాలి. ఇది మీ జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మనలో ప్రతి ఒక్కరికీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, అందంగా కనిపించాలనే ఉంటుంది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. రెగ్యులర్ గా కొత్త హెయిర్ కేర్ రొటీన్ ను ఫాలో అవుతుంటాం. కానీ చేయాల్సినవి మాత్రం చేయం. జుట్టుకు నూనె పెడితేనే మన వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

నిజానికి జుట్టుకు నూనె పెట్టడం వల్ల వెంట్రుకలకు పోషణ అందడంతో పాటుగా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. నల్లగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రిలాక్డ్స్ ఫీల్ కలుగుతుంది. ఆయిల్ మసాజ్ చేయడానికి చేతి వేళ్లతో తలకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి, టెన్షన్ వంటి సమస్యలు ఇట్టే తగ్గుతాయి. ఒత్తిడి తగ్గడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి.

ఎండాకాలంలో చెమటలు పట్టడం వల్ల జుట్టులో జిడ్డు బాగా పేరుకుపోతుంది. నెత్తిమీద, జుట్టుకు నూనెను మసాజ్ చేయడం వల్ల ఈ జిడ్డు సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం కొబ్బరినూనె, బాదం నూనె లేదా ఆవనూనెతో తలకు మసాజ్ చేయొచ్చు. ఇది మీ జుట్టును షైనీగా చేస్తుంది.

ఎండాకాలంలో ఎండలో బయటకు వెళ్లడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. సూర్యరశ్మి, సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు జుట్టును ఎండిపోయేలా చేస్తాయి. సూర్యరశ్మికి జుట్టు దెబ్బతినకుండా ఉండటానికి మీరు రాత్రి పడుకునే ముందు లేదా తలస్నానం చేయడానికి కొన్ని గంటల ముందు హెయిర్ ఆయిల్ తో నెత్తిమీద బాగా మసాజ్ చేయండి.