తిరుమలేశునికి ఎన్ని రకాల అలంకారాలో తెలుసా ? వింటే భక్తి పారవశ్యంతో పులకించిపోతారు.. !

| Edited By:

Sep 27, 2019 | 10:55 PM

అలంకార ప్రియుడైన గోవిందుడి అందం, వైభవం, వైభోగం అంతా అయనకు అలంకరించే బంగారు అభరణాలు, పుష్పమాలికల్లోనే నిక్షిప్తం అయి ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకానంతరం మూలమూర్తిని వివిధ రకాలైన వజ్రవైడూర్యాలు, రత్నాలు పొదిగిన అభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అపద్భాంధవుడుగా, ఆపద మొక్కులవాడిగా వేనోళ్ల కీర్తింపబడతున్న శ్రీనివాసునికి అలంకరించే అభరణాలను, వాటి పేర్లను తెలుసుకుందాం…. తిరుమల క్షేత్ర వైభవాన్ని పొగడడానికి, అలంకార ప్రియుడైన శ్రీనివాసుని వైభోగాన్ని కీర్తించడానికి పదాలు […]

తిరుమలేశునికి ఎన్ని రకాల అలంకారాలో తెలుసా ? వింటే భక్తి పారవశ్యంతో పులకించిపోతారు.. !
Follow us on

అలంకార ప్రియుడైన గోవిందుడి అందం, వైభవం, వైభోగం అంతా అయనకు అలంకరించే బంగారు అభరణాలు, పుష్పమాలికల్లోనే నిక్షిప్తం అయి ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకానంతరం మూలమూర్తిని వివిధ రకాలైన వజ్రవైడూర్యాలు, రత్నాలు పొదిగిన అభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అపద్భాంధవుడుగా, ఆపద మొక్కులవాడిగా వేనోళ్ల కీర్తింపబడతున్న శ్రీనివాసునికి అలంకరించే అభరణాలను, వాటి పేర్లను తెలుసుకుందాం….

తిరుమల క్షేత్ర వైభవాన్ని పొగడడానికి, అలంకార ప్రియుడైన శ్రీనివాసుని వైభోగాన్ని కీర్తించడానికి పదాలు చాలవన్నది పురాణ ఇతిహాసాల మాట. స్వామివారి సేవలో తరించిన ఎందరో పురుషులు, పుణ్యపురుషులు సైతం స్వామివారి వైభవాన్ని తమ కీర్తనల్లోనూ, గంధ్రాల్లోనూ పోందుపరిచారు. అయితే కోట్లాది రూపాయల అదాయంతో వేలకోట్ల రూపాయల విలువైన అభరణాలు కలిగిన శ్రీనివాసుని అందం అయనకు అలంకరించే అభరణాల్లోనూ, పూలల్లోనే ఉందంటారు భక్తులు. అయితే ప్రతిశుక్రవారం స్వామివారికి జరిగే అభిషేకం తర్వా త వివిధ రకాలైన అభరణాలను అలంకరిస్తారు. అనధికారిక లెక్కల ప్రకారం స్వామివారికి దాదాపు 40 టన్నుల బంగారు అభరణాలు, వస్తువులు ఉన్నట్లు, సమాచారం.

స్వామివారి నిత్య అలంకరణలో స్వర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, నుపురాళ్లు, పగడాలు, కాంచిగుణం, ఉదరబంధం, దశావతర హారం, చిన్నకంఠాభరణం, పెద్ద కంఠాభరణం, బంగారు పులిగోరు హారం, ఆరుమూరల చంద్రహారం, సువర్ణ యజ్ఞోపవీతం, సాధారణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, చతుర్భుజ లక్ష్మీహారం, అష్టోత్తరశతనామ హారం, సూర్యకఠారీ, వైకుంఠభహస్తం, కటిహస్తం, కడియాలు, కరభూషాలు, కడియాలు భూజదండభూషాలు, నాగాభరణాలు, భూజకీర్తులు, కర్ణపత్రాలు, చక్రం, శంఖం, ఆకాశరాజు కిరీటం, సాలగ్రామహారం, రత్నకిరీటం, మేరుపచ్చ, రత్నమయ శంఖుచక్రాలు, రత్నమయ కర్ణపత్రాలు, రత్నమయ వైకుంఠ కటిహస్తాలు, రత్నమయ మకరకంఠి, స్వర్ణపీతాంబరం శ్రీవారి అలంకరణకు వినియోగిస్తారు.

వక్షఃస్ధలంలో తగిలించి ఉన్న భూదేవి ప్రతిమ, నిత్యం అలంకరించే ఈ అభరణాలన్నీ గతంలో అర్చకుల అధీనంలో ఉండేవి. ప్రస్తుతం టిటిడి ఉద్యోగి అయిన పారుపత్తేదారుకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఇవే కాకుండా స్వామివారికి నూపురాలు, పగడాలు, కాంచీగుణం, బంగారుపులిగోరు హరం, అకాశరాజు కిరీటాన్ని అలంకరిస్తారు. తిరుమలేశుడికి ఉన్న నగల్లో చాలా విలువైన కిరీటం. దాదాపు 28వేల 369 వజ్రాలన్నాయి. దాదాపు 26 కేజీల బంగారాన్ని ఈ కిరీటం తయారీలో ఉపయోగించారు. ఈ కిరీటాన్ని తయారు చేయడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పట్టగా, దాదాపు 40 మంది కళాకారులు సుమారు 7 నెలల కాలం శ్రమించారు. 1985 డిసెంబర్ 20వ తేదీన స్వామివారికి టిటిడి ఈ విలువైన కిరీటాన్ని అలంకరించింది. ఇప్పటి వరకూ భక్తుల సమర్పించిన, మరియు టిటిడి తయారు చేయించిన కిరీటాలు స్వామివారికి అధికారికంగా ఏడు ఉన్నాయి. వీటిని ప్రతివారానికి ఒకటి చోప్పున స్వామివారి మూల మూర్తికి అలంకరిస్తారు. కాగా స్వామివారికి ఉన్న అరుదైన అభరణాల్లో గరుడమేరు పచ్చ అత్యంత విలువైనది. ఇది దాదాపు 500 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

నిత్యం ధృవమూర్తికి ఉండే ఈ అభరణం వార్షిక గరుడసేవనాడు మలయప్పస్వామివారికి అలంకరిస్తారు వీటినే నిత్యకట్ల ఆభరణాలుగా పిలుస్తారు,, అంతే కాకుండా ఆస్థాన సమయాల్లో, ఊగాధి, వైకుంట ఏకాదశి,ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం లాంటి పర్వధినాల సమయంలో స్వామి వారికి వెలకట్టలేని వజ్ర,వైడూర్యాలు పోధిగిన విశేష తిరువాభరణాలను అలంకరిస్తారు.