Tirumala: నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారంటే..

|

Oct 15, 2023 | 9:24 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ రోజు నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఏ రోజున ఏ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో తెలుసుకుందాం 

1 / 9
అక్టోబర్ 15వ తేదీ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించనున్నారు.  భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద్దశేషవాహన సేవ జరగనుంది. ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై దేవేరులతో కలిసి మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. భక్తులను అనుగ్రహించనున్నారు. 

2 / 9
అక్టోబర్ 16వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం 8 గంటలకు మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. 

3 / 9
అక్టోబర్ 17వ తేదీ: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం 8 గంటలకు  వెంకటాచలపతి  సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

4 / 9
అక్టోబర్ 18వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం 8గంటలకు శ్రీవారు  ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు  స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు. 

5 / 9
అక్టోబర్ 19వ తేదీ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ జారనుంది. జగన్నాటక సూత్రధారి మలయప్ప స్వామి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

6 / 9
అక్టోబర్ 20వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం 8 వంటలకు హనుమంత వాహన సేవ రాముని అవతారంలో శ్రీవారు హనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలసిన స్వామి, అమ్మవార్లకు సేద దీరడానికి సాయంత్రం 4 గంట‌ల‌కు పుష్పకవిమాన సేవ చేయనున్నారు. శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్పస్వామి పుష్పకవిమానంలో విహరించనున్నారు. ఈ సేవ మూడేళ్లకు వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నవరాత్రుల్లో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.   

7 / 9
అక్టోబర్ 21వ తేదీ: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజున ఉదయం 8 గంటలకు స్వామివారి సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధులలో విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. ఈ వాహనంపై శ్రీవారు విహరిస్తూ భక్తులకు అభయహస్తం ఇవ్వనున్నారు.

8 / 9
అక్టోబర్ 22వ తేదీ: శ్రీవారి నవరాత్రి బ్రహ్మో త్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన స్వర్ణరథాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ జరగనుంది. అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. 

9 / 9
అక్టోబర్ 23వ తేదీ: శ్రీవారి నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు. ఈ రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి చక్రస్నానం వేడుకను నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం శ్రీవారు తన ఉభయదేవేరులతో కలిసి   చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. 