పాలల్లో నీరు: పాలు పాలలో నీరు కలిపారో లేదో తెలుసుకోవడం చాలా సులభం.. ఏటవాలుగా ఉన్న ప్రాంతంపై ఒక చుక్క పాలు వేయండి. స్వచ్ఛమైన పాలు అయితే ఆ పాల చుక్క నెమ్మదిగా తెల్లటి గీతను వదిలి ముందుకు కదులుతుంది. అదే నీరు కలిసిన పాలు అయితే వేసిన వెంటనే జర్రున జారుతూ కిందకు చేరుకుంటాయి.
పిండి పాలు గుర్తించడానికి: పాలను స్టార్చ్ లాడిన్ ద్రావణంలో ఒక చుక్క పాలు వేయండి.. అవి నీలం రంగులోకి మారితే.. పాలల్లో పిండి కలిపినట్లు లెక్క
యూరియా తో పాల తయారీ గుర్తింపు : ఒక చుక్క పాలను తీసుకుని యూరియా ఒక టెస్ట్ ట్యూబ్‌లో వేయండి.. దానిలో కొంచెం పసుపుని వేయండి.. తర్వాత బాగా కలపండి. కొంచెం సేపటి తర్వాత ఆ పాలకు ఎరుపు లిట్మస్ కాగితాన్ని జోడించండి. ఈ కాగితం నీలం రంగులోకి మారితే, పాలలో యూరియా కలిసిందని అర్ధం.
సింథటిక్ పాలు: ఈ పాలు చేదుగా ఉంటాయి. అంతేకాదు పాలను తీసుకుని చర్మంపై రుద్దితే.. సబ్బు రుద్దిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు ఈ పాలు వేడి చేసిన తర్వాత పాలు పసుపు రంగులోకి మారుతాయి.
సబ్బు పొడితో పాలు: డిటర్జెంట్ 5 నుండి 10 మి.లీ పాలలో సమానమైన నీటిని బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఎక్కువ నురుగు వస్తే.. ఆ పాలల్లో డిటర్జెంట్ కలిపినట్లు లెక్క.
ఇక కల్తీ పాలను గుర్తించడానికి ప్రస్తుతం షాప్స్ లో యూరియా స్ట్రిప్ దొరుకుతున్నాయి. వీటి సాయంతో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు,