
గురువారం ఈశా యోగా కేంద్రంలో కార్తీక దీపం సందర్భంగా ఆదియోగి శివుని విగ్రహానికి గ్రామస్తులు, గిరిజనులు మట్టి దీపాలను వెలిగించారు. సూర్యుడు అస్తమించగానే ఈశా యోగా కేంద్రంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

గురువారం కోయంబత్తూరులో దీపాలు వెలిగించడంలో పాల్గొన్న ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ గిరిజన సమాజానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నారు.

బాహ్య కాంతి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని స్పష్టంగా చూసే సామర్థ్యాన్ని పెంచినట్లే, అంతర్గత కాంతి మన అవగాహన, అవగాహనను పెంచి స్పృహ అంతిమ విముక్తికి దారితీస్తుందన్నారు.

కార్తీక దీపం అనేది లోపల, వెలుపల చీకటిని కాంతిగా మార్చే వేడుక అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈశా కేంద్రంలో వెలిగించిన దీపాల నుంచి వచ్చిన కాంతి అక్కడి స్థానికుల గుండెల్ని తాకింది.ఆ దృశ్యం నల్లని ఆకాశంలో నారింజ రంగు తామరలు వికసించినట్టు కనిపించింది. ఈ దృశ్యాలు అందిరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి.