
వర్షా కాలం జబ్బులకు పెట్టింది పేరు. ఈ సీజన్‌లో వ్యాధులు ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. గాలిలో బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మ క్రిములు ఎక్కువగా పెరుగుతాయి. దీని వల్ల సీజన్‌లో కూరగాయల్లో ఎక్కువగా కీటకాలు ఉంటాయి.

ముఖ్యంగా ఆకు కూరలపై ఎక్కువగా కీటకాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో ఆకు కూరలు దూరంగా ఉండటమే మంచిది. బచ్చలి కూర, పాల కూర, మెంతి కూర వంటి కూరలపై ఎక్కువగా కీటకాలు ఉంటాయి.

ఇలా కీటకాలు ఉన్న ఆకు కూరలు తింటే ఎక్కువగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దద్దర్లు, దురదలు, అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో ఆకు కూరలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు.

ఒక వేళ మీరు ఆకు కూరలు తినాలి అనుకుంటే.. గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి అందులో ఆకు కూరలను బాగా కడిగి తీసుకోవడం మంచిది. ఇలా తీసుకోవడం వల్ల ఆకు కూరల్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.

అన్నీ మన కంటికి కనిపించే బ్యాక్టీరియానే కాదు.. కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కాబట్టి ఆకు కూరల్ని ఇలా శుభ్రం చేస్తే అవి నశిస్తాయి. మీ ఆరోగ్యం కూడా బావుంటుంది. ఈ సీజన్‌లో కూరగాయలను ఎక్కువగా కొనకపోవడం మంచిది.