
తెల్లవారు జామున వచ్చే కలలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. తెల్లవారు జామున ఎలాంటి కల వచ్చినా జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

ఇలా కలలో అనేక రకాల వస్తువులు, రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కలలో జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే జంతువుల రూపాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. మరి ఎలాంటి జంతువులు కలలో కనిపిస్తే శుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం.. ఆవులు కలలో కనిపిస్తే చాలా మంచిది. మీరు త్వరలోనే విజయాలు అందుకుంటారని అర్థం. భ్యవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు ఉండవు. అలాగే ఏనుగు కనిపిస్తే.. మీమల్ని అదృష్టి వరిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కష్టాలన్నీ తీరయబోయని అంటారు.

అదే విధంగా లక్ష్మీ దేవికి ప్రీతికరమైన వాటిల్లో గుడ్ల గూబ కూడా ఒకటి. గుడ్ల గూబ కలలో కనిపించినా చాలా మంచిది. మీరు త్వరలోనే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందబోతారని అర్థం. మీరు అనుకన్న పనులు త్వరలోనే విజయవంతంగా నెరవేరుతాయని సూచన.

కలలో నలుపు రంగు ఉన్న పాము కనిపించినా చాలా అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని.. మీరు అనుకున్న కలలు త్వరలోనే జరుగుతాయని సంకేతం. ధనలాభం కూడా కలుగుతుంది. NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. గమనించగలరు)