
కూరగాయలు, పండ్లు ఎలా నిల్వ చేయాలి? ఏవి ఫ్రిజ్‌లో పెట్టకూడదు? ఏవి పెట్టాలి అని ముందు తెలుసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫ్రిజ్‌లో స్టోర్ చెయ్యకూడదు. అలా నిల్వ చేయకూడని కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బంగాళాదుంపలు : బంగాళాదుంపల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అయితే, వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకండి. అలా పెట్టి తింటే అది కొత్త సమస్యలు వస్తాయి. అలాగే, ఈ దుంపలకు ఉల్లి, వెల్లుల్లికి దూరంగా పెట్టండి.

టమాటలు: మార్కెట్లో టమాటాలు చౌకగా దొరుకుతాయి. ఇక అందరూ కేజీల కేజీలు కొనేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. ఇలా చేస్తే వాటి రుచిని త్వరగా కోల్పోతోంది. కాబట్టి, వీటిని బయటే పెట్టి మూడు రోజుల్లో మొత్తం వంటకు ఉపయోగించండి.

దోస కాయలు : దోస కాయలు నార్మల్ గానే గట్టిగానే ఉంటాయి. బయట ఉన్నా కూడా ఫ్రెష్ గానే ఉంటాయి. దీనిలో నీటి ఎక్కువగా ఉంటుంది అదంతా డ్రైగా మారి రుచిని కోల్పోయి పాడైపోతాయి.కాబట్టి , వీటిని ఫ్రిజ్‌లో పెట్టకపోయినా పర్లేదు.

వంకాయలు: వంకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజులకు సన్నగా అవుతాయి. ఆ చల్ల దనానికి దాని పరిమాణం కోల్పోయి ఎండిపోతుంది. కాబ్టటి, అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకండి. ఇవి బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టి తింటే టేస్ట్ కూడా మారుతుంది.