Pimples on face: మొటిమలు వేధిస్తున్నాయా? ఈ ఇంటిప్స్‌ ఫాలో అయితే చందమామలాంటి ముఖం మీ సొంతం

ముఖం మీద మొటిమలు రావడం సాధారణం. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. కానీ అవి మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం చికాకుగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ సౌందర్యం కూడా పాడైపోతుంది. అటువంటి సందర్భాలలో రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. మొటిమలను పూర్తిగా తగ్గించడానికి..

|

Updated on: Oct 17, 2024 | 9:28 PM

ముఖం మీద మొటిమలు రావడం సాధారణం. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. కానీ అవి మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం చికాకుగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ సౌందర్యం కూడా పాడైపోతుంది. అటువంటి సందర్భాలలో రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. మొటిమలను పూర్తిగా తగ్గించడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తారు. కానీ అవి అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. వాటిని శాశ్వతంగా వదిలించుకోవాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

1 / 5
యుక్తవయస్సులో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. బాలికలలో ఈ సమస్య తరచుగా పీరియడ్స్‌ ప్రారంభమైన తర్వాత సంభవిస్తుంది. ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమస్య సర్వసాధారణం. అబ్బాయిలు, అమ్మాయిలకు 14 సంవత్సరాల వయస్సు తర్వాత మొటిమల సమస్య అభివృద్ధి చేందుతుంది. అయితే కొందరిలో మొటిమలు ఏళ్ల తరబడి ఉండి రకరకాల అనారోగ్యాలకు కారణమవుతాయి.

2 / 5
డా. భావుక్ ధీర్ ప్రకారం.. ముఖంపై మొటిమలు కనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల, శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ సమతుల్యత చెదిరిపోతుంది. దీంతో ముఖంపై మొటిమలు వస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే యువత కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి.

3 / 5
చర్మంపై మొటిమలకు మరొక ప్రధాన కారణం ఆహారం. డైరీ, జంక్ ఫుడ్, మితిమీరిన స్వీట్లు ముఖంపై మొటిమలకు దారి తీస్తుంది. చాలా సందర్భాలలో నిద్ర లేకపోవడం, అధిక ధూమపానం కూడా మొటిమలకు దారితీస్తుంది. కొన్నిసార్లు చర్మ సంరక్షణ సరిగ్గా చేయకపోయినా మొటిమలు వస్తాయి. ఉదాహరణకు, ముఖాన్ని సరిగ్గా కడగకపోతే మొటిమలకు దారితీస్తుంది. అలాగే ముఖాన్ని తరచుగా తాకడం, ముఖం కడుక్కోకపోవడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్యుపరమైన అంశాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.

4 / 5
చర్మవ్యాధి నిపుణుడు డా. సౌమ్య సచ్‌దేవ్ ప్రకారం.. మొటిమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటించాలి. అన్నింటిలో మొదటిది, ముఖం పరిశుభ్రతను నిర్వహించడం. మీ ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు కడగాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా కడగడం మంచిది. అలెర్జీ ఉన్న ఆహారాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. స్వీట్లు, కారంగా, వేయించిన, వేడి ఆహారాలు తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తే, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. రోజుకు కనీసం 7 గ్లాసుల నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగినంత నిద్ర అవసరం. ఈ పద్ధతులను ప్రయత్నించినా మొటిమల సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని డా. సౌమ్య సలహా ఇస్తున్నారు.

5 / 5
Follow us