Mutton: మటన్ తిన్న తర్వాత వీటిని తింటే మీ పని అయిపోయినట్లే.. ప్రాణాలకే డేంజర్..

Updated on: Jan 05, 2026 | 7:37 PM

నాన్‌వెజ్‌లో మటన్ అంటే ఇష్టపడని వారుండరు. ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా ఉంటారు. అయితే మటన్ రుచిగా ఉన్నప్పటికీ అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. మటన్ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే అవి శరీరానికి హాని చేస్తాయని, తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పాలు - పాల ఉత్పత్తులు: మటన్ లేదా చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు లేదా మజ్జిగ తీసుకోకూడదు. మాంసాహారం, పాల ఉత్పత్తులు రెండూ విరుద్ధ స్వభావం కలవి. ఇవి కలిసి జీర్ణ ప్రక్రియను నెమ్మదింపజేసి, ఫుడ్ పాయిజనింగ్ లేదా చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి రసం తీసుకోవడం ఉత్తమం.

2 / 5
తేనెతో ప్రమాదం: మటన్ శరీరంలో వేడిని కలిగిస్తుంది. తేనె కూడా ఉష్ణ గుణం కలిగినదే. ఈ రెండింటి కలయిక వల్ల శరీరంలో వేడి విపరీతంగా పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మటన్ తిన్న వెంటనే తేనెకు దూరంగా ఉండాలి.

3 / 5
భోజనం తర్వాత టీ: చాలా మందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మటన్ తిన్న తర్వాత టీ తాగడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట కలిగే ప్రమాదం ఉంది.

4 / 5
పండ్ల విషయంలో: ముఖ్యంగా అరటిపండు వంటి త్వరగా జీర్ణమయ్యే పండ్లను మటన్ తిన్న వెంటనే తినకూడదు. ఇది కడుపులో గ్యాస్ సమస్యలను సృష్టిస్తుంది. అలాగే అధిక చక్కెర లేదా అధిక కారం ఉన్న పదార్థాలు తీసుకుంటే నీరసంగా అనిపిస్తుంది.

5 / 5
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం: మటన్ తిన్న తర్వాత నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 15-20 నిమిషాలు నడవడం మంచిది. మటన్‌ను వీలైనంత వరకు మధ్యాహ్న భోజనంలోనే తీసుకోవాలి. ఒకవేళ రాత్రి పూట తింటే పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే తినాలి. కడుపు నిండా మాంసాన్నే కాకుండా కొంత భాగం కూరగాయలకు, మరికొంత నీటికి ఖాళీ ఉంచడం ఆరోగ్యకరం.