
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడికి, శని గ్రహానికి మంచి సంబంధం ఉంటది అంటుంటారు. అంతే కాకుండా, శని గ్రహం అండగా ఉండే రాశులంటే హనుమంతుడికి చాలా ఇష్టమంట. వారిపై హనుమాన్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయంట.కాగా, ఆంజనేయ స్వామి ఇష్టపడే రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సింహ రాశి : సింహ రాశి అంటే హనుమాన్‌కు చాలా ప్రీతికరమైన రాశి అంటుంటారు. ఈ రాశి వారిపై ఎప్పుడూ హనుమాన్ చల్లని చూపు ఉంటుందంట. ఆంజనేయ స్వామి దీవనల వలన వీరు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితే ఎదురు కాదంట. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారంట.

మకర రాశి : హనుమంతునికి ఇష్టమైన రాశుల్లో మకరరాశి ఒకటి. ఆంజనేయ స్వామి ఆశీస్సుల వలన ఈ రాశి వారి ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందుతారు. ఎవరైతే చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది.

మకరరాశి వారికి హనుమాన్ అనుగ్రం ఎక్కువగా ఉండటం వలన వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అవసరానికి డబ్బులు చేతికందుతాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని అందుకుంటారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి హనుమాన్ దీవెనెలు ఎప్పటికీ ఉంటాయి. వీరికి హనుమాన్ అనుగ్రహం ఉంటుంది. అందలన ఈ రాశి వారికి అప్పుల సమస్యలు తీరిపోతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.