
వేసవి కాలం స్టార్ట్ కావడంతో.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే సరిపోదు. ఇంకా చల్లగా ఉండాలి. వేసవి తాపం తెలీకుండా ఉండాలంటే ఏసీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మధ్య తరగతి ఫ్యామిలీస్ కూడా ఈఎమ్‌ఐ రూపాల్లో అయినా ఏసీలను తీసుకుంటున్నారు.

AC Side Effects

ఏసీ ఉపయోగం వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఎయిర్ కండీషనర్‌ను ఎక్కువగా యూజ్ చేసతే.. కళ్లు అనేవి పొడిగా తయారవుతాయి. ఏసీ.. గాలిలోని తేమను తొలగిస్తుంది.

ఏసీ కారణంగా బద్ధకం, అలసట అనేవి కూడా పెరిగిపోతాయి. అంతే కాకుండా పలు రకాల చర్మ సమస్యలు, అలెర్జీలు, ఆస్తమా వంటివి కూడా వచ్చేస్తాయి. స్వచ్ఛమైన గాలిని గదిలోపల లేకపోతే.. అలెర్జీలు వస్తాయి. చర్మం కూడా పొడిగా మారి దురదను, చికాకును కలిగిస్తుంది.

ఏసీ నుంచి వచ్చే గాలి.. డీహైడ్రేషన్ కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఎక్కువగా ఏసీలో ఉండటం, వాడకం వల్ల శ్వాస సమస్యలు వస్తున్నట్లు చాలా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఏసీని అవసరం అయినప్పుడు మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది.