
నరదిష్టి అనేది చాలా శక్తి వంతమైనది. దీని ప్రభావం వ్యక్తిపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా నరదిష్టి ఉంటుందో, వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారంట. ముఖ్యంగా అప్పుల సమస్యలు అధికం అవ్వండం, పదే పదే అనారోగ్యానికి గురి అవ్వడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు పండితులు.

అయితే ఈ నరదిష్టిని పొగొట్టే శక్తి కొన్నింటికి ఉంటుందంట. అందులో ఒకటి సముద్ర జలం. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు, తమకు నరదిష్టి తగిలింది అని భావించే వారు, ప్రతి శుక్రవారం లేదా శని వారం సముద్ర తీరానికి వెళ్లి కొంత నీరు తీసుకొచ్చి ఇంటి చుట్టూదొడ్డుపుతో కలిపి చల్లడం వలన నరదిష్టిపోతుందంట.

అలాగే నరదిష్టి నుంచి ఉపశమనం పొందాలి అంటే తప్పకుండా ప్రతి రోజూ ఇంటిలో సాంబ్రాణి ధూపం వేయాలంట. దీని వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతున్నారు పండితులు. మరీ ముక్యంగా పౌర్ణమి, అష్టమి, నవమి రోజున ఇంటిలో ధూపం వేయడం చాలా మంచిదంట

ఉప్పుతో కూడా నరదిష్టిపోతుందంటున్నారు పండితులు. వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఉన్నా, దొడ్డు ఉప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి, మంగళ వారం రోజున ఇంటికి ఎదురుగా కట్టాలి అంట. తర్వాత దానిని బుధ వారం రోజున పారే నదిలో వేయడం వలన సమస్యలన్నీ తొలిగిపోతాయంట

నోట్ :నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.