
ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు చార్టర్డ్ అకౌంటెంట్ రంగం ఒకటి. అకౌంటింగ్‌లోనూ మంచి పట్టు ఉన్నవారు చార్టర్డ్ అకౌంటెంట్లు అవుతారు. డబ్బు ఉన్నన్ని రోజులు ఈ ఉద్యోగానికి ఢోకా ఉండదు. సీఏ పూర్తి చేసిన వారికి మంచి జీతాలు ఉంటాయి. బాగా అనుభవం ఉన్న వారు నెలకు రూ. 5 నుంచి రూ. 24 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్న వారు ఉన్నారు.

బిజినెస్ అనలిస్ట్‌లకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. రోజురోజుకీ పెరుగుతోన్న వ్యాపారాలు, సంస్థల మధ్య పోటీ నేపథ్యంలో బిజినెస్ అనలిస్ట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. వ్యాపారాల్లో మంచి లాభాలు రావాలని కోరుకునే వారు బిజినెస్ అనలిస్ట్‌లను ఏర్పాటు చేసుకుంటారు.

న్యాయ నిపుణులకు కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ నెలకొంది. ఇటీవల ఈ రంగంలో స్థిరపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టాప్ లాయర్లు కేసులను బట్టి నెలకు ఏకంగా రూ. 15 నుంచి రూ. 20 లక్షలు కూడా ఆర్జిస్తున్న వారు ఉన్నారు.

ఇక విమానయాన రంగంలో కూడా అధిక జీతాలు వస్తాయి. దేశంలో అత్యధిక వేతనాలు పొందే రంగాల్లో విమానయా రంగం ఒకటి. పైలట్ మొదలు మరెన్నో ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో ఉద్యోగం సాధించిన వారు నెలకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశంలో డిజిటల్ మార్కెటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. టాప్ కంపెనీలు డిటిజల్ మార్కెటింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో మంచి అనుభవం గడిస్తే ఐటీతో సమానమైన జీతాలు పొందో అవకాశం లభిస్తుంది.